బాడీ ఉంటే సరిపోదు.. హిట్ ఇవ్వగలిగే సత్తా ఉండాలి: Sunny Deol

ప్రముఖ సీనియర్ నటుడు సన్నీ డియోల్ తాజాగా ‘గద్దర్ 2’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.

Update: 2023-08-13 11:37 GMT

దిశ, సినిమా: ప్రముఖ సీనియర్ నటుడు సన్నీ డియోల్ తాజాగా ‘గద్దర్ 2’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్ సందర్భంగా ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడిపేస్తున్న ఆయన.. ఇప్పటి బాలీవుడ్ హీరోలపై వైరల్ కామెంట్స్ చేశాడు. ‘బాలీవుడ్ అంటే కండలు తిరిగిన బాడీ చూపించడం.. ముద్దు సీన్లు, హీరోయిన్ల స్కిన్ షోలు కాదు. ప్రతి హీరోకు తన సినిమాలో ఏదో ఒక సీన్‌లో సిక్స్ ప్యాక్ బాడీని చూపించడం అలవాటైపోయింది. హీరో ఎలివేషన్ సీన్స్‌కు టైమ్ వేస్ట్ అవుతూ సినిమా కథకు విలువ లేకుండా పోతుంది. మీరేమి బాడీ బిల్డర్స్ కాదు కండలను పెంచుకోవడానికి. బాడీ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటే చాలు. మీరు నటులు అనే సంగతి మరిచిపోవద్దు. నటనపై దృష్టి పెట్టండి’ అంటూ సన్నీ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News