Suma Kanakala :యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పనున్న సుమ.. కారణం ఇదే!
తన మాటలు, చలాకీతనంతో అందరినీ మాయ చేస్తుంది సుమ. బుల్లి తెరపై యాంగరింగ్, పలు రకాల గేమ్ షోలతో ఎంటర్టైన్ చేస్తుంటుంది. ఇక ఏదైనా ఈవెంట్‌లో
దిశ, వెబ్‌డెస్క్ : తన మాటలు, చలాకీతనంతో అందరినీ మాయ చేస్తుంది సుమ. బుల్లి తెరపై యాంగరింగ్, పలు రకాల గేమ్ షోలతో ఎంటర్టైన్ చేస్తుంటుంది. ఇక ఏదైనా ఈవెంట్‌లో సుమ ఉందంటే చాలా ఆ సందడే వేరు ఉంటది. ఎంత పెద్ద షో అయినా సరే బెదరకుండా తన మాటలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. కొందరు హీరోలు సుమా డేట్స్‌ను బట్టి కూడా ఈవెంట్ నిర్వహించుకున్న సంఘటనలున్నాయి. అలాంటి సుమ యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
సుమ ఆరోగ్యం బాగోలేదని.. ఆమె ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నది అనే న్యూస్ వైరల్‌గా మారింది. సుమను డాక్టర్స్ ఎక్కువ సేపు నిలబడ కూడదని చెప్పారంట. ఎక్కువ సేపు పడుకొనే ఉండాలి రెస్ట్ తీసుకోవాలని చెప్పారంట. అందువల సుమ తన ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడానికి కొన్ని రోజుల పాటు బుల్లి తెరకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు సైన్ చేసిన ఈ వెంట్స్ కంప్లీట్ చేసి తాను యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పనుందంట. ఇక ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. సుమా స్పందిస్తే గానీ క్లారిటీ రాదు అంటున్నారు తన అభిమానులు.
ఇవి కూడా చదవండి :