‘పుష్ప-2’ గంగమ్మ జాతరకు సర్వం సిద్ధం! సుకుమార్ ప్లాన్ మామూలుగా లేదుగా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు

Update: 2023-11-02 04:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఇటీవల నేషనల్ అవార్డు కూడా రావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా దర్శకుడు పార్ట్-2 అంచనాలకు ధీటుగా ఈ సినిమాను రూపొందించే పనిలో ఉన్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 40 శాతం వరకు షూటింగ్ పూర్తైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకు సంబంధించి కూడా భారీ షెడ్యూల్స్ జరిగాయి. వచ్చే సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుందని మేకర్స్ ఆఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

తాజా సమాచారం ప్రకారం.. నవంబర్‌ 2 నుంచి రెండో భాగం భారీ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుందట. ఈ షెడ్యూల్లో సుకుమార్ పెద్ద జాతర ఫైట్‌ ప్లాన్‌ చేస్తున్నారట. అలాగే ఫైట్‌ ముందు వచ్చే పలు సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తారట. అలాగే ఒక పాట కూడా ఈ షెడ్యూల్‌లోనే షూట్‌ చేసే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్‌లో బన్నీ తిరుపతి గంగమ్మ జాతరకి సంబంధించిన వేషంలో కనిపించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. కాగా ఫైట్‌ కోసం అల్లు అర్జున్ ఇదే గెటప్‌లో కనిపించవచ్చని సోషల్ మీడియాలోని జనాలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌-లావణ్య త్రిపాఠి పెళ్ళిలో ఉన్న బన్ని ఈరోజు(నవంబరు 2) నైట్ హైదరాబాద్‌ చేరుకుని రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నారని సమాచారం.

Tags:    

Similar News