470 కేజీల వెండితో పవన్‌ కళాకృతి.. సుజయ్ బాబు అభిమానానికి నెటిజన్లు ఫిదా!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వినూత్నంగా అభిమానాన్ని చాటుకుని ఔరా అనిపించాడు నెల్లూరు నగర జనసేన అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు.

Update: 2023-08-31 10:47 GMT

దిశ, సినిమా: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వినూత్నంగా అభిమానాన్ని చాటుకుని ఔరా అనిపించాడు నెల్లూరు నగర జనసేన అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు. సెప్టెంబర్ 2న పవన్ జన్మదినం సందర్భంగా సుమారు 470 కేజీల సిల్వర్‌ చైన్‌లతో పవన్‌ కళాకృతిని రూపొందించాడు. ఇందుకు సంబంధించిన మేకింగ్ వీడియోను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విడుదల చేయగా ప్రస్తుతం తెగ వైలర్ అవుతుంది.

ఇక జనసేన అధినేత పవన్‌కు విన్నూతంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలన్న ఆలోచనతో ఓ స్వర్ణ కళాకారుడి ద్వారా ఈ రూపాన్ని తయారు చేయించినట్లు సుజయ్‌ బాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డి, పార్టీ నేతలు వెంకటేశ్వర్లు సుందర రామిరెడ్డి పాల్గొనగా సుజయ్ బాబు అభిమానంపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు పవన్ ఫ్యాన్స్.


Similar News