మహేష్ బాబుకి కాల్ చేసిన సుధీర్ బాబు.. వైరల్ అవుతున్న ఆడియో
సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘హరోం హర’. సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి నాయుడు నిర్మాణంలో జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 14న రిలీజ్ కానుంది.
దిశ, సినిమా: సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘హరోం హర’. సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి నాయుడు నిర్మాణంలో జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 14న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేయగా అవి భారీ అంచనాలు పెంచాయి. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో సుధీర్ బాబు సినిమా ప్రమోషన్లో భాగంగా సుధీర్ బాబు మహేష్ బాబుకి కాల్ చేసి మాట్లాడిన ఆడియోను ప్లే చేశారు. ఈ కాల్‌లో పలు ఆసక్తికర అంశాల గురించి మాట్లాడారు మహేష్ బాబు. దీంతో ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఆ ఆడియోలో సుధీర్- మహేష్ ఏం మాట్లాడుకున్నారంటే..
సినిమాలో షూటింగ్, లేదా ట్రైనింగ్‌కి సంబంధించి గన్స్‌తో ఫస్ట్ ఎక్స్ పీరియన్స్ ఏంటి అని సుధీర్ అడగ్గా.. ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు కానీ టక్కరి దొంగ సినిమా సమయంలో మొదటిసారి వాడాను. ఆ షూటింగ్ టైమ్‌లో నాన్న గారి మోసగాళ్లకు మోసగాడు సినిమా గుర్తొచ్చేది అని తెలిపారు. అలాగే గన్స్‌ని బాగా హ్యాండిల్ చేసే వాళ్లలో మీ ఫేవరేట్ యాక్టర్ ఎవరు అంటే.. నాన్న గారే మోసగాళ్లకు మోసగాడు సినిమా వందసార్లు చూసి ఉంటాను అని తెలిపారు మహేష్ బాబు.
హరోంహర నుంచి ఇప్పటివరకు వచ్చిన కంటెంట్‌లో ఏది నచ్చింది అని సుధీర్ అడుగగా.. హరోం హర టైటిల్ బాగుంది. నువ్వు కొత్తగా కనిపించావు. స్టోరీ బ్యాక్ డ్రాప్ కూడా కొత్తగా ఉంది. ఆడియన్స్‌కి నచ్చుతుంది ఈ సినిమా అని తెలిపారు. హరోంహరలో సుబ్రమణ్య స్వామి రిఫరెన్స్ ఉంది. అలా మైథాలజీలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి అని అడగ్గా.. హనుమ నా ఫేవరేట్ లార్డ్ అని తెలిపారు. ప్రస్తుతం ఈ ఆడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.