The Vaccine War: సినిమాపై సుధామూర్తి రివ్యూ.. ఏమన్నారంటే? (వీడియో)
బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’.
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. ఈ సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి హాజరైన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘మహిళగా నేను సాటి మహిళలను అర్థం చేసుకోగలను. మహిళ తన కెరీర్‌లో ముందుకు వెళుతూ భార్య, తల్లి బాధ్యతలు కూడా నెరవేర్చాలి. కుటుంబాన్ని వృత్తిని బ్యాలెన్స్ చేయడం కష్టంతో కూడిన వ్యవహారం. ఈ విషయంలో కొందరు మాత్రం అదృష్టవంతులు. పిల్లల్ని చూసుకుంటూ కెరీర్ లో సక్సెస్ కావడం అంత సులభం కాదు. కుటుంబ మద్దతు ఉండాలి. ఒక సక్సెస్‌ఫుల్ మహిళ వెనుక అర్థం చేసుకునే మగవాడు ఉంటాడు.
ది వ్యాక్సిన్ వార్ చిత్రంలో చిన్న పిల్లలు తమ తల్లుల సక్సెస్ చూసి గర్వంగా ఫీల్ అవుతారు. సాధారణ జనాలకు ఈ కోవ్యాక్సిన్ అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు. ఆ వ్యాక్సిన్ పొందడానికి సైంటిస్ట్స్ పడ్డ కష్టాన్ని ఈ చిత్రం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది కేవలం కష్టం కాదు, నిస్వార్ధంతో కూడిన హార్డ్ వర్క్. సైంటిస్ట్స్ నెలల తరబడి లాబొరేటరీలో గడిపారు. దాని ఫలితమే ఆరోగ్యకరమైన డెమొక్రటిక్ కంట్రీ. మనం హ్యాపీగా ఉన్నాము.
అటువంటి మంచి సందేశం ఈ చిత్రంలో ఉంది. మనకు గొప్ప సామర్థ్యాలు ఉన్నాయి. కానీ మన మీద మనకు నమ్మకం ఉండదు. మనం తలుచుకుంటే చేయగలం. ఈ చిత్ర సందేశం అదే. ఒక వైద్య రంగంలోనే కాదు ప్రతి రంగంలో మనం గొప్ప విజయాలు సాధించగలం. అందం అనేది బట్టలు, మేకప్ లో లేదు. విశ్వాసం, ధైర్యం లో ఉంది. ఈ చిత్రం అదే తెలియజేస్తుంది. భారతీయులందరూ తమ సామర్థ్యాలను బయటకు తీయాలి. కష్టపడుతూ ఉండండి. గర్వపడే భారతీయులుగా మనం ఉంటాం’’ అంటూ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ఈ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు.
Thank you @SmtSudhaMurty ji for your inspiring words at the screening of #TheVaccineWar #ATrueStory. pic.twitter.com/xw5Jpa8iLL
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) September 18, 2023