వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.. Nithya Menen కామెంట్స్ వైరల్

ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది.

Update: 2023-10-03 15:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. కానీ, చాలా మంది టెక్నాలజీని ఎదుగుదలకు కాకుండా.. కొన్ని చెత్త పనులకు ఉపయోగిస్తున్నారు. వాటిలో AI ఒకటి. ప్రస్తుతం ఏఐ ప్రభావం సమాజంలో రోజురోజుకు పెరిగిపోతుంది. అమ్మాయిల ఫొటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసి ఇష్టమొచ్చినట్లుగా ఫేక్ అకౌంట్స్‌లో పోస్ట్ చేస్తున్నారు కొంత మంది వ్యక్తులు. దీని కారణంగా చాలా మంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మంది అయితే వారి ప్రాణాలను సైతం వదులుకుంటున్నారు. అంతలా ఏఐ ప్రభావం ప్రజలపై పడుతోంది. తాజాగా దీనిపై స్పందించింది హీరోయిన్ నిత్యామీనన్. ఈ సమస్య తను కూడా ఎదుర్కొంటున్నట్లు చెప్పుకొచ్చింది.

‘‘హీరోయిన్లను చాలా మంది దారుణంగా చూడాలని ఆశ పడతారు. నేను ఎక్కడికి వెళ్లిన నాకు తెలియకుండా కొంతమంది ఫొటోలను తీస్తుంటారు. నేను ఒక్కదాన్నే కాదు ప్రతీ హీరోయిన్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. నటీనటుల ఫొటోలను తీసుకున్న వారు వాటిని మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తారు. అలాంటి వారిని ఏం అనాలి..? ఒక నటి జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంది. వాటికి తోడు ఇలాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాలి అంటే ఎలా.? ఇలాంటి పనులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఏఐ కారణంగా చాలా మంది అమాయకపు ఆడపిల్లలు వాళ్ల జీవితాలను సైతం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది’’ అంటూ నిత్యా మీనన్ తన సన్నిహితుల దగ్గర చెప్పుకొచ్చిందట. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News