పెళ్లి చేసుకోవడానికి అడ్డొచ్చే క్యాస్ట్.. ముద్దు పెట్టుకోవడానికి అడ్డు రాలేదా..?: స్టార్ హీరోయిన్
సినీ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. హీరో-హీరోయిన్లు, డైరెక్టర్లు- హీరోయిన్లు.. పలు నటీనటులు రిలేషన్స్ పెట్టుకోవడం.. ప్రేమలు, పెళ్లిళ్లు, డివోర్స్.. మరల వేరే వ్యక్తులతో లవ్ లో పడటం.. ఇవన్నీ సినీ ఇండస్ట్రీలో కామన్ అంటూ జనాలు నెట్టింట చర్చించుకుంటూనే ఉంటారు. కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బయట యువత హద్దులు మీరి ఎలా ప్రవర్తిస్తున్నారో తెలిసిన విషయమే. చిన్న వయసులోనే ప్రేమలో పడుతున్నారు. సహజీవనం చేస్తున్నారు. చివరకు తల్లిదండ్రులు కులం వేరని పెళ్లికి అంగీకరించపోతే పలువురు.. బయటికెళ్లి వివాహం చేసుకుంటున్నారు.
మరికొంతమంది తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఇదే విషయంపై సంచలన కామెంట్స్ చేసింది. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ యంగ్ బ్యూటీ నెట్టింట హ్యూజ్ ట్రోలింగ్‌కు గురవుతుంది. సినిమా షూటింగ్ సమయంలో ఓ హీరోతో ప్రేమలో పడిందట. ఇండస్ట్రీలో చట్టాపట్టాలేసుకుని ఫుల్‌గా తిరుగారట. ఎన్నో సార్లు కెమెరాకు కూడా చిక్కారట. వీరిద్దరు వేకేషన్స్‌లో తెగ ఎంజాయ్ చేసేవారట. అంతా క్లోజ్ గా మూవ్ అయ్యాక.. పెళ్లి చేసుకోకపోతే ఎలా అని ఓ రోజు హీరో దగ్గర పెళ్లి విషయం తీసుకొచ్చిందట.
దీంతో అతడు మీ క్యాస్ట్ వేరు ఎలా విహాహం చేసుకుంటామని సడన్ షాక్ ఇచ్చారట. దీంతో ఆమె.. కలిసి తిరిగేటప్పుడు, హగ్‌లు, కిస్‌లు పెట్టుకునేటప్పుడు రాని కులం పెళ్లి విషయంలో మాత్రమే అడ్డు వస్తుందా? అని ప్రశ్నించిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. కొంతమంది ఈ హరోయిన్‌కు సపోర్ట్‌గా మాట్లాడగా.. మరికొంతమంది .. నీ బుద్ధి అప్పుడు ఎక్కడ పెట్టుకున్నావ్ మరీ? అంటూ మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.