పెళ్లైన రెండు నెలలకే తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ ..
ట్యాలెంటెడ్ హీరోయిన్ అమలా పాల్ తన ప్రియుడు జగత్ దేశాయ్తో గతేడాది జూన్ నుంచి డేటింగ్లో ఉండి..
దిశ, సినిమా : హీరోయిన్ అమలా పాల్.. తన ప్రియుడు జగత్ దేశాయ్తో గతేడాది జూన్ నుంచి డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక కేరళలోని కొచ్చిలో నవంబర్ 5న వివాహ బంధంతో ఒకటయ్యారు ఈ జంట. పెళ్లికి పది రోజుల ముందు అమలా పాల్ తన పుట్టినరోజు నాడు అక్టోబర్ 26న ఆమెకు ప్రపోజ్ చేశాడు జగత్ దేశాయ్. అప్పుడే పెళ్లికి ఎస్ చెప్పింది అమలా పాల్. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా షేర్ చేయగా వైరల్ అయింది. ఇక తాజాగా ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో అమలా పాల్ గుడ్ న్యూస్ చెప్పింది. తాను గర్భవతినంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. పెళ్లైన రెండు నెలలకే తన జీవితంలో మాతృ ప్రేమను అందించడానికి, ఆ అనుభూతిని చెందడానికి సిద్ధం అవుతున్న.. అంటూ ఆనందం వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ.