నేను గర్భవతిగా ఉన్నప్పుడు రాజీవ్ అలా సార్లు చేశాడు.. సుమ ఎమోషనల్ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. స్టార్ మహిళ, క్యాష్, పంచావతారం, సూపర్ సింగర్, అవాక్కయ్యారా, జీన్స్, భలే చాన్సులే, పట్టుకుంటే పట్టుచీర, లక్కు కిక్కు వంటి షోలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక టాలీవుడ్ అగ్ర హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు సుమ తప్పకుండా ఉండాల్సిందే. వ్యక్తిగత విషయానికొస్తే.. ఈమె రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా వీరి దాంపత్య జీవితానికి 25 ఏళ్ళు గడిచాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకుని పాతికేళ్ళు గడిచిన సందర్భంగా సుమ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేసింది. ఈ వీడియో చూస్తుంటే సుమ, కనకాల అంగరంగ వైభవంగా మ్యారేజ్ డే ను జరుపుకున్నట్లు తెలుస్తుంది.
ఈ సందర్భంగా వృద్ధాశ్రమానికి కూడా వెళ్లి.. తమకు తోచిన సాయం చేశారు. ఈ క్రమంలో సుమ ఒక కార్యక్రమం నిర్వహించింది. తన యూట్యూబ్ ఛానల్ లో ఉన్న సబ్ స్క్రైబర్లు అడిగిన క్వశ్చన్స్‌కు సుమ, కనకాల నవ్వుతూ సమాధానాలు చెప్పారు. ‘మీ భార్యకి తెలియకుండా ఆమె ఫోన్ ఎప్పుడైనా చెక్ చేశారా అని రాజీవ్‌ను అడగ్గా.. లేదు ఎప్పుడు అలా చేయలేదని చెబుతాడు. సేమ్ క్వశ్చన్ సుమను అడగ్గా.. చేశాను ఒకసారి అని బిగ్గరగా నవ్వే బొమ్మలు పెట్టి సమాధానం ఇస్తుంది.
దీంతో రాజీవ్ ఒక్కసారిగా షాక్ అయి చూస్తాడు. సుమ మాట్లాడుతూ.. చెక్ చేశా కానీ ఫోన్ లో ఏం పర్సనల్స్ లేవు, ఏం దొరకలేదని నవ్వుతూ చెబుతుంది. హహహ మరీ దొరికేలాగా పెడతామా ఏంటి? అంటూ రాజీవ్ ఫన్నీ సెటైర్ వేస్తాడు. రాజీవ్ కారణంగా ఏమైనా బాధపడ్డ సందర్భాలున్నాయా? అని అడగ్గా.. అవును ఉన్నాయి. నేను గర్భవతిగా ఉన్నప్పుడు రాజీవ్ బయటికెళ్లేటప్పుడు మళ్లీ ఎప్పుడొస్తావని అడిగేదాన్ని.. ఎప్పుడు అడిగినా 5 మినిట్స్ లో వచ్చేస్తా అని చెబుతాడు.
కానీ ఎప్పుడూ అలా రాడు. చాలా ఆలస్యంగా వస్తాడు. ఈ కారణంగా నేను చాలా బాధపడ్డాను. ఎప్పుడొస్తాడని ఎదురుచూసేదాన్ని. ఇక రాజీవ్ కనకాల వెంటనే క్షమాపణ కోరుతాడు. భర్త క్షమించమని అడగడంతో సుమ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే రాజీవ్ ఎప్పుడు హర్రర్ సినిమాలకే తీసుకెళ్లేవాడని.. నేను ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో దెయ్యాల మూవీలకే ఎక్కువగా తీసుకెళ్లేవారని సుమ చెప్పుకొచ్చింది.