వామ్మో.. పులిని ఒళ్లో కూర్చోబెట్టుకుని పాలు పట్టించిన స్టార్ నటి.. పిక్స్ వైరల్
బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌లో నటించి.. తన నటనతో బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకుంది నటి శ్రీవాణి.
దిశ, సినిమా: బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌లో నటించి.. తన నటనతో బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకుంది నటి శ్రీవాణి. ‘‘కలవారి కోడలు,మనసు మమత, చంద్రముఖి, మావి చిగురు, కాంచన గంగ’’ లాంటి సీరియల్స్ ఈమెకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. విలన్ పాత్రలో నటించాలంటే శ్రీవాణి తర్వాతే ఎవరైనా. ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూ స్టార్ గుర్తింపు తెచ్చుకుంటూనే మరోవైపు బుల్లితెరపై ఫేస్టివల్స్ టైంలో వచ్చే స్పెషల్ ఈవెంట్లలో హాజరవుతూ.. తన మాటలతో బుల్లితెర ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేది.
గత ఏడాది ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి, తన భర్త, కుమార్తెకు సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని తన ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ బాగానే మనీ సంపాదిస్తుంది. ప్రస్తుతం శ్రీవాణి సీరియల్స్ ఎక్కువగా కనిపించడం లేదు. అయినప్పటికీ ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ ఉంటుంది.
తాజాగా నటి శ్రీవాణికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్గా బ్యాంకాక్ టూర్‌కు వెళ్లినట్లు ఈ నటి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. కాగా అక్కడున్న ఓ జూ పార్క్‌కు వెళ్లి.. ఎంతో డేర్‌గా అందులో ఉన్న ఒక పులికి పాటు పట్టించింది. పైగా తన ఒళ్లో కూర్చోబెట్టుకుని మరీ పాల డబ్బాతో పాలు తాగిస్తుంది.
పులి కూడా శ్రీవాణికి సహకరిస్తూ.. ఇంతకు ముందు వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అన్నట్లుగా పులి దర్జాగా తనపై ఒరిగి పాలు తాగుతుంది. ఈ ఫొటోను శ్రీవాణి తన ఫ్యాన్స్‌తో పంచుకోగా.. గ్రేట్ శ్రీవాణి మేడమ్, మీ ధైర్యానికి రెండు చేతులెత్తి మొక్కిన తక్కువే అంటూ పలువురు కామెంట్లు పెట్టగా.. మరికొంతమంది సోషల్ మీడియాలో ఫేమ్ కావడం కోసం సిల్లీ ట్రిక్స్ ప్లే చేస్తే ప్రాణాలకే ప్రమాదం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం శ్రీవాణి పులికి పాలు పట్టిస్తోన్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.