పట్టుచీర కట్టుకొని, మెడలో మల్లెపూలతో దర్శనమిచ్చిన యాంకర్ శ్రీముఖి.. గుడ్‌న్యూస్ చెప్పనుందా?

పటాస్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను దగ్గరైంది యాంకర్ శ్రీముఖి.

Update: 2024-01-11 12:32 GMT

దిశ, సినిమా: పటాస్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను దగ్గరైంది యాంకర్ శ్రీముఖి. తర్వాత బిగ్‌బాస్ రియాలిటీ షోలో అవకాశం దక్కించుకుని మరింత ఫేమ్ అయ్యింది. రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ కాగా.. ఈ బుట్టబొమ్మ రన్నర్‌గా నిలిచింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చాక ఈ అమ్మడుకు భారీగా ఆఫర్లు వచ్చాయి. హీరో రామ్ నటించిన ‘నేను శైలజ’ సినిమాలో హీరో సిస్టర్‌గా నటించిన విషయం తెలిసిందే. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రంలో చిరు సరసన నటించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నడుము సీన్‌లో నటించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది.

ఇకపోతే శ్రీముఖి తరచూ హాట్ ఫొటో షూట్‌తో నెట్టింట కుర్రాళ్లను కదురుగా ఉండనివ్వదు. హద్దులు చెరిపే అందాలతో మతిపోగోడుతుందకోండి. అయితే అప్పుడప్పుడు ఈ భామ ట్రెడిషనల్ వేర్ ధరించి యువతను అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా శ్రీముఖి పట్టు చీర కట్టుకొని, మెడ నిండుగా నగలు ధరించి, జడలో మల్లె పువ్వులు పెట్టుకుని ఫొటో షూట్ చేసింది. ఈ పిక్స్ కాస్త తన ఫ్యాన్స్‌తో పంచుకోగా.. ‘‘పెళ్లి కళ వచ్చేసిందోయ్ భామ’’ అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. మరికొంతమంది ఇంత స్పెషల్‌గా రెడీ అయ్యావంటే ఎమైనా గుడ్‌న్యూస్ చెబుతారా ఏంటి? అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీముఖి నిండుగా ధరించిన పట్టుచీర ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 












Similar News