దేవర షూటింగ్‌లో శ్రీకాంత్‌కు ప్రమాదం (వీడియో)
ప్రస్తుతం కారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గానూ చేస్తున్నాడు.
దిశ,వెబ్ డెస్క్: హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని కెరియర్లో దాదాపు అన్ని హిట్ సినిమాలే.. ప్రస్తుతం కారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గానూ చేస్తున్నాడు. కానీ సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. అఖండ చిత్రంలో విలన్‌గా మెప్పించినా.. కనిపించినా..మంచి ఆఫర్లు మాత్రం రాలేదు. సైడ్, సపోర్టింగ్ రోల్స్‌తోనే శ్రీకాంత్ కాలం గడిపేస్తున్నాడు. శ్రీకాంత్ మెయిన్ పాత్రలో నటించిన కోటబొమ్మాళీ పీఎస్ మూవీ విడుదల కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం శ్రీకాంత్ బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చాడు.ఇదిలా ఉండగా .. శ్రీకాంత్ కాలికి ఉన్న పట్టీ గురించి నాగ్ అడిగాడు. ఇదెలా జరిగిందని నాగ్ అడగడంతో శ్రీకాంత్ అసలు విషయాన్ని వివరించాడు.
గోవాలో దేవర షూటింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగిందని వివరించాడు. ఇసుక దిబ్బలో పరిగెడుతుంటే.. కాలు బెణికిందని. చిన్న గాయమే కదా? అని షూటింగ్ చేస్తూనే వచ్చాడట. ఆ తరువాత కొద్ది రోజులకి వాపు ఎక్కువ అయిందట. దీంతో డాక్టర్ వద్దకు వెళ్తే.. రెస్ట్ తీసుకోమని చెప్పాడట. నిజం చెప్పు ఈ గాయం తారక్ వల్ల అయిందా? అని నాగ్ కామెడీగా అడిగితే.. తారక్ వల్ల కాదులే అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు శ్రీకాంత్.