నన్ను లొంగదీసుకున్నాడు.. సీఎం కొడుకుపై Sri Reddy కామెంట్ వైరల్
శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
దిశ, సినిమా: శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాస్టింగ్ కౌచ్ గురించి ఉద్యమం చేసి ఎందరో స్టార్ హీరోల మీద హాట్ కామెంట్స్ చేసి పాపులారిటి దక్కించుకుంది. ఎప్పుడు సంబంధంలేని విషయాల్లో జోక్యం చేసుకుంటూ స్టార్ హీరోలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా మరోసారి శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అది కూడా ఈసారి ఏకంగా ‘నాకు ఆ పొలిటిషియన్‌తో రిలేషన్ ఉంది’ అంటూ బాంబు పేల్చింది.
ఇక ఆ రాజకీయ నాయకుడు మరెవరో కాదు తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్. కాగా ‘ఉదయనిధి నాకు దాదాపు మూడేళ్ల క్రితం నుంచే తెలుసు. నాతో గడిపిన ప్రతి మూమెంట్ తనకు నచ్చుతాయని చెప్పేవాడు. నాకు ఛాన్స్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. నాతో అవసరం తీరాక మరిచిపోయాడు’ అని సంచలన కామెంట్స్ చేసింది. ఏకంగా సీఎం కొడుకుతో రిలేషన్ ఉందని శ్రీరెడ్డి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇవి కూడా చదవండి : Chiranjeevi , Pawan Kalyan కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన Naveen Polishetty