కోట్లు ఇస్తానన్న ఆ స్టార్ హీరోను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. అప్పుడే అంత పొగరు పనికిరాదంటున్న నెటిజన్లు..!
సినీ ఇండస్ట్రీలో పాపులారిటీ దక్కించుకోవాలంటే అందంతో పాటు టైం కూడా కలిసిరావాలి.
దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో పాపులారిటీ దక్కించుకోవాలంటే అందంతో పాటు టైం కూడా కలిసిరావాలి. అలా సినీ రంగంలో అడుగుపెట్టి అతి తక్కువ సమయంలొనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన వారిలో శ్రీలీల ఒకరు. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన అందంతో, నటనతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. దీంతో అమ్మడు చుట్టూ ఆఫర్లు తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చిన్న హీరో, పెద్ద హీరో అని చూడకుండా ఏ అవకాశం వచ్చిన వదులుకోకుండా.. ప్రతీ ఆఫర్‌కు సైన్ చేస్తూ బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది ఈ బ్యూటీ.
ఇదంతా పక్కన పెడితే.. తాజాగా ఈ ముద్దుగుమ్మపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంత చిన్న వయసులోనే అంత పొగరు పనికిరాదంటూ తిట్టిపోస్తున్నారట. ఇంతకీ ఏం అయిందంటే..? కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తను నటించబోయే సినిమాకు హీరోయిన్గా శ్రీలీలను ఎంచుకున్నారట. అంతేకాదు.. సినిమాలో చేసేందుకు ఆమెకు రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డారట. కానీ, ఈ ఆఫర్‌కు శ్రీలీల నో చెప్పిందని టాక్. దీంతో స్టార్ హీరో అయిన విశాల్ సినిమాను ఆమె రిజెక్ట్ చేసిందని కోలీవుడ్ ప్రజలు శ్రీలీలపై మండిపడుతున్నారని వినికిడి.
Read more : గుంటల కోసం గుంటకి పూజ చేస్తున్న పవన్ బావ.. శ్రీ రెడ్డి కామెంట్స్ వైరల్<