రూటు మార్చిన శ్రీలీల.. సీనియర్స్ బాటలోనే వెళ్తుందిగా..

అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది.

Update: 2024-03-27 15:41 GMT

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత వరసగా సినిమా ఆఫర్స్ అందుకొని స్టార్ హీరోయిన్‌గా మారింది. ఇక ఇటీవల శ్రీలీల నటిస్తున్న సినిమాలు వరుసగా డిజాస్టర్ అవుతూ వచ్చాయి. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో ఆఫర్స్ రావడం లేదు అంటూ ఈ మధ్య అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే నిజంగానే ఈ అమ్మడుకు టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ రావడం లేదంట. దీంతో ఈ బ్యూటీ సీనియర్స్ బాటలో వెళ్తుదంట.

శ్రీలీల తమిళ ఇండస్ట్రీపై కన్నేసిదంట.తాజాగా ఓ కళశాలలో ఈవెంట్ కోసం తమిళనాడు వెళ్లిన ఈ బ్యూటీకి అక్కడ ఆమెకు మంచి రెస్పాన్స్ వచ్చిదంట. ఆమెకు ఊహించని విధంగా ఫ్యాన్స్ వెలకమ్ చెప్పారంట. దీంతో ఈ బ్యూటీ తనకు తమిళంలో నటించాలని, మనసులో మాట బయట పెట్టారంట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


Similar News