Sreeleela remuneration:రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన యంగ్ హీరోయిన్..?
'పెళ్లి సందD' మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోయిన్ శ్రీ లీల.
దిశ, సినిమా: 'పెళ్లి సందD' మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోయిన్ శ్రీ లీల. తన అద్భుతమైన నటనతో.. అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ భామ. తాజాగా రవితేజ 'ధమాకా' మూవీలో హీరోయిన్‌గా నటించింది. దీంతోపాటు ఇంకో అరడజను సినిమాలకు సైన్ చేసింది. అయితే ప్రస్తుతానికి శ్రీ లీల రెమ్యూనరేషన్ గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
'ధమాకా' చిత్రానికి రూ. 40 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుందని టాక్. అలాగే తన నెక్స్ట్ సినిమాకు రూ.1 కోటికి ఓకే చేసిందంట. ఇంకో విషయం ఏమిటంటే.. వెంట వెంటనే డేట్స్ అడ్జెస్ట్ చేస్తే రూ.1.5 కోట్లు ఇస్తానని ఓ నిర్మాత ఆఫర్ ఇచ్చాడట. మొత్తానికి కెరీర్ బిగినింగ్‌లో మంచి డిమాండ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఏ రేంజ్‌లో హిట్ కొడుతుందో చూడాలి.