తారక్, బన్నీకి పోటీగా ఔరా అనిపిస్తున్న శ్రీలీల డ్యాన్స్..!

అతి పిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోయిన్లకు సైతం వణుకుపుట్టిస్తుంది యంగ్ బ్యూటీ శ్రీలీల.

Update: 2023-08-03 12:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: అతి పిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోయిన్లకు సైతం వణుకుపుట్టిస్తుంది యంగ్ బ్యూటీ శ్రీలీల. ఈ హీరోయిన్ ప్రస్తుతం అగ్ర హీరోల సరసన నటిస్తూ మరింత క్రేజ్ సంపాదించుకుంటుంది. ఇప్పుడు ఈ భామ చేతిలో ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి. కోట్లల్లో రెమ్యూనరేషన్ అందుకుంటోంది. అయితే ఈ హీరోయిన్.. పోతినేని రామ్ సరసన బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘స్కంద’ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘నీ చుట్టూ చుట్టూ’ సాంగ్ మ్యూజిక్‌ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. ఇప్పటికే తన డ్యాన్సింగ్‌ స్కిల్స్‌తో ఔరా అనిపిస్తున్న శ్రీలీల.. ఈ సారి మరింత డోస్‌ పెంచేసింది. ఈ సాంగ్‌లో రామ్‌ను మించిపోయేలా చేస్తున్న ఈ బ్యూటీ డ్యాన్స్‌‌కు నెటిజన్లు.. ‘‘జూనీయర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మాస్ ఎనర్జీకి ఏ మాత్రం తగ్గకుండా.. స్టార్ హీరోలతో పోటీపడేలా స్టెప్పులు వేస్తున్నావ్‌గా శ్రీలీల’ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ యంగ్ బ్యూటీ, స్టైలిష్ కిల్లింగ్ స్టెప్పులు హాట్ టాపిక్‌గా మారాయి.

Tags:    

Similar News