Sreeja - Kalyan Dev : కళ్యాణ్ దేవ్ పోస్ట్‌కు శ్రీజ కౌంటర్.. తారా స్థాయికి చేరిన విభేదాలు?
హీరో కళ్యాణ్ దేవ్, మెగా డాటర్ శ్రీజ ఇద్దరు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: హీరో కళ్యాణ్ దేవ్, మెగా డాటర్ శ్రీజ ఇద్దరు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరు విడిపోయారని.. శ్రీజ మూడో పెళ్లి చేసుకుంటుందని, కళ్యాణ్ కూడా తన బంధువుల అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే అధికారంగా మాత్రం ఈ జంట విడిపోయినట్లు ఎక్కడ చెప్పలేదు. తాజాగా కళ్యాణ్ దేవ్, శ్రీజ పెట్టిన పోస్ట్‌లు మాత్రం వీరిద్దరు దూరంగా ఎందుకు ఉంటున్నారో చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది.
కళ్యాణ్ దేవ్ పోస్ట్.. ''ఎదుటి వాళ్లు మనల్ని ఎంత ఇష్టపడుతున్నారు అనేది ముఖ్యం కాదు. వాళ్లు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది ముఖ్యం'' అని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో కళ్యాణ్ దేవ్‌కు మెగా ఇంట్లో ఏదన్న అవమానం జరిగి ఉంటుంది. అందుకే బయటకు వచ్చేశాడు అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ దేవ్ పోస్ట్‌కు కౌంటర్‌గా శ్రీజ కూడా ఓ పోస్ట్ షేర్ చేసింది. ''ఒకరిని ప్రేమించడం అంటే వారు మీతో మరింత ప్రేమలో పడేలా చేయడం కాదు.. మీరు ఎప్పుడైనా చేయాల్సింది ఎదుటి వారిలో ప్రేమను గుర్తించడం. ప్రేమను వెతకడం కాదు.. అది ప్రతిచోటా ఉంటుంది'' అంటూ పోస్ట్ చేసింది. ఇక వీరి ఇద్దరి పోస్ట్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
Read more:
Kalyan Dev : చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్!