శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడాకులు.. ఎమోషనల్ పోస్ట్‌తో ఫుల్ క్లారిటీ ఇచ్చిన మెగా అల్లుడు

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఇంట్లో నుంచి పారిపోయి ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఓ కూతురు పుట్టాక ఏదో కారణం వల్ల విడాకులు తీసుకుని చిరంజీవి దగ్గరకు వచ్చేసింది.

Update: 2023-06-18 03:33 GMT

దిశ, వెబ్ డెస్క్: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఇంట్లో నుంచి పారిపోయి ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఓ కూతురు పుట్టాక ఏదో కారణం వల్ల విడాకులు తీసుకుని చిరంజీవి దగ్గరకు వచ్చేసింది. కొంత కాలం గడిచిన తర్వాత చిరు, కల్యాణ్ దేవ్‌తో శ్రీజ పెళ్లి జరిపించారు. వీరికి ఓ కూతురు పుట్టాక మనస్పర్థలు వచ్చి శ్రీజ, కల్యాణ్ విడిపోయారని కొద్ది కాలంగా పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయినా ఈ వార్తలపై అటు మెగా ఫ్యామిలీ కానీ, కల్యాణ్ దేవ్ కానీ అధికారికంగా స్పందించలేదు. ఇటీవల కల్యాణ్ దేవ్ తన కూతురిని గుర్తు తెచ్చుకుని పలు ఎమోషనల్ పోస్టులు పెట్టడంతో అందరూ నిజంగా వీరిద్దరు విడిపోయారని అనుకున్నారు. అన్నీ కుదుటపడ్డాక మళ్లీ కలుస్తారని భావించారు. కానీ, ఇటీవల వరుణ్ తేజ్, లావణ్య ఎంగేజ్‌మెంట్‌కు కూడా మెగా అల్లుడు కల్యాణ్ రాలేదు.

దీంతో ఇద్దరు విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. తాజాగా, ఈ రోజు ఫాదర్స్ డే కావడంతో కల్యాణ్ దేవ్ తన కూతురు నవిష్కతో ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. అంతేకాకుండా ‘వారంలో నేను సంతోషంగా గడిపే క్షణాలు ఈ నాలుగు గంటలు మాత్రమే. కూతుర్లు చాలా బెస్ట్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో అది చూసిన నెటిజన్లు ‘శ్రీజను పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పారు. ఓ సాధారణ అమ్మాయిని వివాహం చేసుకోవాల్సింది. ఆమె ఇంతకు ముందు ఒకసారి చేసినందున ఇలాగే జరుగుతుందని ఆమెకు తెలుసు’ అంటూ కామెంట్స్ చేస్తూ కల్యాణ్ దేవ్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Also Read: పెళ్లిలో ఆ తప్పు చేస్తే విడిపోతారా.. అందుకే సామ్, చై కూడా..

Tags:    

Similar News