తండ్రీకొడుకుల కాన్సెప్ట్‌తో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న SP బాలు తనయుడు
విశ్వగానగంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తన పాటలతో ఎంతో మందిని మాయ చేశాడు. సంగీత ప్రపంచంలోనే రారాజుగా వెలుగొందాడు. కాగా ఆయన కుమారుడు ఎస్‌పీ చరణ్
దిశ, సినిమా : విశ్వగానగంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తన పాటలతో ఎంతో మందిని మాయ చేశాడు. సంగీత ప్రపంచంలోనే రారాజుగా వెలుగొందాడు. కాగా ఆయన కుమారుడు ఎస్‌పీ చరణ్ లాంగ్ గ్యాప్ తర్వాత తండ్రీ కొడుకుల ఎమోషనల్ కాన్సెప్ట్‌తో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. చరణ్ ఇప్పటికే తెలుగులో నాలో, మూడు ముక్కల్లో చెప్పాలంటే సినిమాల్లో నటించాడు. కానీ అవి అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలోనే లాంగ్ గ్యాప్ తర్వాత తండ్రీ కొడుకుల ఎమోషనల్ కనెసెప్ట్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడంట. ఈ మూవీ ఎల్‌వైఎఫ్ అనే టైటిల్‌తో తెరకెక్కగా,లవ్ యువర్ ఫాదర్ అన్నది ఈ మూవీ క్యాప్షన్. ఈ సినిమాలో చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. హీరో తండ్రిగా ఓలీడ్ క్యారెక్టర్‌లో చరణ్ కనిపిస్తారంట.
ఇక చరణ్ సింగర్‌గా దక్షిణాది భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌ను ఆలపించాడు. నిర్మాతగా పదికిపైగా సినిమాలు నిర్మించాడు. అతడు ప్రొడ్యూస్ చేసిన అరణ్య కాండం మూవీ నేషనల్ అవార్డును గెలుచుకున్నది. నటుడిగా, హోస్ట్‌గానే కాకుండా ప్రొడ్యూసర్‌గా కొన్ని సినిమాలు నిర్మించాడు. తండ్రి ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం మరణించడంతో అతడి స్థానంలో పాడుతా తీయగా సినిమాకు హోస్ట్‌గా ఎస్.పి. చరణ్ వ్యవహరిస్తున్నాడు.