Kanguva: 'కంగువ' నుంచి సాలిడ్ అప్డేట్.. ట్రైలర్ వచ్చేది అప్పుడే?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'.
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. హ్యూజ్ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్ కాగా.. బాబీ డియోల్ పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తున్నాడు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ‘కంగువ’ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.
ఈ మేరకు ఆగస్టు 12వ తేదీన "కంగువ" ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. కాగా.. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సిజిల్ టీజర్, పోస్టర్స్, ఫైర్ సాంగ్ అన్ని కూడా సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. దీంతో ఆగస్టు 12న రిలీజ్ కాబోయే ట్రైలర్‌పై కూడా హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నట్లు తెలుస్తుది. అంతే కాకుండా పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.