సూర్య ‘కంగువ’నుంచి సాలిడ్ అప్ డేట్స్.. టీజర్ అండ్ రిలీజ్ డేట్ ఫిక్స్!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు శివ కాంబోలో వస్తున్న ‘కంగువ’ నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.

Update: 2023-10-26 12:26 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు శివ కాంబోలో వస్తున్న ‘కంగువ’ నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌తోపాటు రిలీజ్ డేట్ వివరాలు వెల్లడించారు. ఈ మేరకు అనుకున్నదానికంటే బడ్జెట్‌ చాలా ఎక్కువైందన్న నిర్మాతలు 2024 వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ‘ఇటీవలే థాయ్‌లాండ్‌లో కీ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. ‘మగధీర’ లైన్‌లోనే సినిమా ఉండబోతుంది. చెన్నై షెడ్యూల్‌లో వార్‌ సీక్వెన్స్‌ను షూట్‌ చేయబోతున్నాం. పాపులర్ నార్తిండియన్ యాక్టర్‌ ఈ షెడ్యూల్‌లో పాల్గొనబోతున్నాడు. టీజర్‌ జనవరి చివరికల్లా విడుదల చేస్తాం’ అంటూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఇక దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావడంతోపాటు 3డీ ఫార్మాట్‌లోనూ ప్రేక్షకులను అలరించనుంది.

Tags:    

Similar News