నాగచైతన్యపై బెంగ పెట్టుకున్న శోభితా.. అందుకే అలా ఒంటరిగా ఉండి ఆ పని చేస్తోందా?
శోభితా ధూళిపాళ గురించి ఎంత చెప్పినా తక్కువే. సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. చైతూతో శోభితా డేటింగ్‌లో ఉంది. వీరు యూరప్ వెకేషన్స్ కూడా వెళ్తూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు
దిశ, సినిమా : శోభితా ధూళిపాళ గురించి ఎంత చెప్పినా తక్కువే. సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. చైతూతో శోభితా డేటింగ్‌లో ఉంది. వీరు యూరప్ వెకేషన్స్ కూడా వెళ్తూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు అంటూ అనేక వార్తలు వచ్చాయి. అంతే కాకుండా వీరికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ బ్యూటీ కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా, హిట్స్ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా తన లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన లేటేస్ట్ హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ తన అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. కాగా, తాజాగా శోభితన తన సోషల్ మీడియా అకౌంట్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో ఈ బ్యూటీ షిప్‌లో ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుం ఈ ఫోటోలు నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.
అయితే వీటిపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. కొందరు శోభితకు ఏమైంది అంటే మరికొందరూ నాగచైతన్యపై బెంగ పెట్టుకుందేమో అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శోభితా ధూళిపాళ హాలీవుడ్‌లో మంకీ మేన్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే హిందీలో సితార సినిమా కూడా చేస్తుందని, ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైనట్లు సమాచారం. ఇక ఈ బ్యూటీ తెలుగులో గుడాచారి సినిమాలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.