అమ్మ పిలుపును దూరం చేస్తున్న ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎక్స్‌ఫర్ట్స్
ప్రస్తుత రోజుల్లో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా స్మార్ట్ ఫోన్లకు బానిస అవుతున్నారు
దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా స్మార్ట్ ఫోన్లకు బానిస అవుతున్నారు. నేటి సమాజంలో జనాలు.. ఫోన్ చేతిలో లేకపోతే ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నారు. యువతి యువకులైతే అయితే ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడో లేస్తున్నారో కూడా తెలియట్లేదు. ఫోన్లల్లో అంతగా లీనమైపోతున్నారు మరీ. ఇక చిన్నపిల్లల విషయానికొస్తే.. స్మార్ట్ ఫోన్లలో కార్టూన్ బొమ్మలు, రైమ్స్ లాంటి చూపిస్తేనే ఫుడ్ తింటున్నారు. ఓ రకంగా ఈ విషయంలో తల్లిదండ్రులది కూడా తప్పని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులే పిల్లలు ఎడవకుండా.. చెప్పినట్లు వినాలని పిల్లల చేతికి ఫోన్ ఇస్తున్నారు.
ఏడాది నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అయితే భవిష్యత్తులో మెదడుపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతూనే ఉంటారు. టెక్నాలజీ స్పీడ్‌గా పెరుగుతుందని సంతోషించడమే కాకుండా.. ఈ టెక్నాలజీ కారణంగా ఏఏ సమస్యలు తలెత్తుతున్నాయో కూడా అబ్సర్వ్ చేయడం ముఖ్యం. మన లైఫ్ లో ఓ భాగంగా మారిన ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్లు వల్ల సంతానసాఫల్య సమస్యలు కూడా వస్తున్నాయని తాజాగా పలు అధ్యయనాలు తెలిపాయి.
యునైటెడ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ ప్రవర్తనపై ఫోన్ల ప్రభావం, ఐవీఎఫ్‌కు సంబంధించిన ప్రాముఖ్యత, నాయకత్వం, వంటి అంశాలపై చర్చించేలా రీసెంట్‌గా టెడ్ ఎక్స్ ఈవెంట్‌ను నిర్వహించింది. టెడ్ ఎక్స్ అనేది గ్లోబల్ స్థాయి కార్యక్రమం. ఈ ఈవెంట్‌లో అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు పొందిన వ్యక్తులు పాల్గొని.. ల్యాప్ టాప్స్, స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడం వల్ల కలిగే నష్టాల గురించి చెప్పుకొచ్చారు. ఈ ఎక్స్‌ఫర్ట్స్ వెల్లడించిన షాకింగ్ విషయాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ కార్యక్రమంలో నిపుణులు.. మానవ మనస్సు, ప్రవర్తన పై ప్రభావం చూపే వాటి గురించి వారి అభిప్రాయాలు పంచుకున్నారు. ఐవీఎఫ్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్టులు ఐవీఎఫ్‌కు సంబంధించిన ప్రాముఖ్యత గురించి తెలిపారు. అలాగే అమ్మ అయ్యేందుకు ఈ విధానం ఎలా సహాయపడుతుందనే దానిపై మాట్లాడారు. 40 శాతం కేసుల్లో వంధ్యత్వానికి పురుషులు మాత్రమే కారణమని తేలిందని చెప్పారు. వంధ్యత్వానికి కారణమయ్యే కారకాలు.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్‌ల మితిమీరిన వినియోగం ప్రస్తుత రోజుల్లో సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుందని వెల్లడించారు. కాగా వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ ఎక్కువగా వాడకుండా ఉంటే మేలని.. వారి అనుభవాలను పంచుకున్నారు. అలాగే మన ఏజ్ గురించి ఆలోచించకుండా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని, మనం జీవితంలో పై స్థాయికి వెళ్లేందుకు మనల్ని ప్రేరేపించే పుస్తకాలు చదవాలని సలహా ఇచ్చారు.