మత్తెక్కించే చూపులతో సీతారామం బ్యూటీ.. ఆ ఇమేజ్ కోసం బాగా ట్రై చేస్తోందిగా!
‘సీతారామం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: ‘సీతారామం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ స్టార్, హాయ్ నాన్న వంటి చిత్రాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం పలు సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ తాజాగా కల్కి సినిమాలో గెస్ట్ రోల్‌లో నటించి మెప్పించింది. ఐతే సౌత్‌లో తనకు వచ్చిన క్లాస్ ఇమేజ్‌ని మార్చాలని చూస్తుంది ఈ బ్యూటీ. ఎందుకంటే బాలీవుడ్‌లో తనని లవ్ స్టోరీస్‌లో తీసుకోవట్లేదని ఫీల్ అవుతున్నది. అందుకే ఇక్కడ మాత్రం తనలో కూడా గ్లామర్ యాంగిల్ ఉంది అది వాడుకోండి అంటూ హింట్స్ ఇచ్చేస్తుంది మృణాల్. అంతేకాదు ఏదైనా ఈవెంట్ లేదా ఫోటో షూట్‌లో ఐతే అమ్మడు గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తుంది.
ఇదిలా ఉండగా తాజాగా ఈ అమ్మడు ఫేస్ మ్యాగజైన్ కోసం అదిరిపోయే ఫోటో షూట్ చేసింది. అమ్మడికి ఉన్న క్లాస్ ఇమేజ్‌కి ఆమె చేస్తున్న ఈ షోకి అసలేమాత్రం సంబంధం లేదు. ఆ ఫోటోలలో కేవలం కళ్ళతోనే మత్తెక్కించేస్తుంది. అది చూసిన నెటిజన్లు ఇంక చాలు నీ హాట్‌నెస్‌తో తట్టుకోలేక పోతున్నాము అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలా గ్లామర్ లుక్స్‌తో తెలుగులో తనకు ఉన్న క్లాస్ ఇమేజ్‌ని మార్చి కొత్తగా గ్లామర్ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నాలతో రెచ్చిపోతుంది మృణాల్. తెలుగులో 3 సినిమాలు చేయగా 2 హిట్లు కొట్టిన మృణాల్ ప్రస్తుతం తన తర్వాత సినిమా సైన్ చేయలేదు. హిందీలో మాత్రం అవకాశాలతో దూసుకెళ్తుంది మృణాల్. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అదరగొడుతున్న అక్కడ ఇక్కడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ప్రస్తుతం ఈమె ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.