Mahesh Babu: చరిత్ర సృష్టించిన మహేష్ బాబు కూతురు.. భారత్ నుంచి మొట్టమొదటి స్టార్ కిడ్ ఆమె..

సూపర్ స్టార్ మహేష్ బాబు డాటర్ సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

Update: 2023-07-04 09:28 GMT

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు డాటర్ సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ తనకు సంబంధించిన ఫొటోలు.. డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. అయితే ఈ సారి కమర్షియల్ యాడ్‌లో నటించి అందరి దృష్టిని ఆక‌ర్షించింది సితార. ప్రముఖ PMJ జ్యువెలర్స్, సితారను తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా గర్వంగా ప్రకటించింది. ఇందులో భాగంగా ఆమె పేరుతో అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సందర్భంగా (జూలై 4) న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో ఈ వాణిజ్య ప్రకటనను ఆవిష్కరించింది. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ‌ వైర‌ల్ అవుతున్నాయి. మహేష్ బాబు కూడా ట్విట్టర్‌లో ఈ విషయాన్ని షేర్ చేశాడు.

Read More:   త్రివిక్రమ్‌పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్.. తమ హీరోను పట్టించుకోవట్లేదంటూ 

Tags:    

Similar News