భారతీయులు సిగ్గుపడాలి..అత్యాచార ఘటనపై సింగర్ చిన్మయ్ ఫైర్

సింగర్ చిన్మయ్ భారతీయులపై మండిపడింది. ఇటీవల జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో స్పానిష్ టూరిస్ట్‌పై సాముహిక అత్యాచారం ఘటనపై స్పందిస్తూ..భారతీయులందరూ సిగ్గుపడాలి అంటూ తెలిపింది.

Update: 2024-03-06 08:43 GMT

దిశ, సినిమా : సింగర్ చిన్మయ్ భారతీయులపై మండిపడింది. ఇటీవల జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో స్పానిష్ టూరిస్ట్‌పై సాముహిక అత్యాచారం ఘటనపై స్పందిస్తూ..భారతీయులందరూ సిగ్గుపడాలి అంటూ తెలిపింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే చిన్మయ్, మహిళలపై జరుగుతున్న దారుణాలపై సోషల్ మీడియా వేదిక స్పందిస్తారు.

ఈక్రమంలోనే స్పెయిన్ మహిళ అత్యాచార ఘటనపై తన ఎక్స్ ఖాతాలో ఆమె ఈ విధంగా రాసుకొచ్చింది. ‘కొంతమంది భారతీయులు ఒలింపిక్‌ పతకాన్ని గెలుచుకున్నప్పుడు భారతీయులందరూ గర్వపడగలిగితే.. కొంతమంది పురుషులు అత్యాచారం చేసినప్పుడు భారతీయులందరూ కూడా సిగ్గుపడవచ్చు అంటూ తెలిపింది. ఇక ప్రముఖ నటుడు దుల్కర్‌ సల్మాన్‌, నటి రిచా చడ్డా కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులకు చట్టపరంగా శిక్ష పడాలని వారు డిమాండ్‌ చేశారు.

స్పెయిన్ మహిళ తన భర్తతో కలిసి విదేశాల్లో పర్యటిస్తున్న క్రమంలో కొందరు దుండగులు ఆమెపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. 


Similar News