అభిమానులను అట్రాక్ట్ చేస్తున్న 'సిందూరం' ట్రైలర్!
శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో శివ బాలాజీ, ధర్మ, బ్రిడిగా సాగ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'సిందూరం'.
దిశ, సినిమా: శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో శివ బాలాజీ, ధర్మ, బ్రిడిగా సాగ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'సిందూరం'. శ్రీలక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రవీణ్ రెడ్డి జంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి కిషోర్ శ్రీకృష్ణ కథను అందించారు. గౌర హరి సంగీతం అందించారు. రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇంటెన్స్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ బలమైన కథతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరి నటన జీవించినట్టుగా అనిపించింది. జనవరి 26న ఈ సినిమా విడుదలకానుంది.