గుడ్‌న్యూస్.. టీవీ ప్రీమియర్‌కు రెడీ అయిన సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ చిత్రం

రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైర్‌గా తెరకెక్కిన ‘టిల్లు స్వ్కేర్’ చిత్రం జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది.

Update: 2024-08-04 13:38 GMT

దిశ, సినిమా: రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైర్‌గా తెరకెక్కిన ‘టిల్లు స్వ్కేర్’ చిత్రం జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది. టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ అండ్ అనుపమ పరమేశ్వరన్ మధ్య సీన్స్‌కు యువత ఫిదా అయిపోయారు. మరోవైపు పొట్ట చెక్కలయ్యేలా కడుపుబ్బా నవ్వుకున్నారు. ఈ చిత్రం సితార ఎంటర్‌టైన్మెంట్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ ‌హిట్‌గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద వీర లెవల్లో దూసుకుపోయిందనడంలో అతిశక్తిలేదు.

అయితే ఈ ఎంటర్‌టైనర్ చిత్రం త్వరలో టెలివిజన్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ‘టిల్లు స్వ్కేర్’ శాటిలైట్ రైట్స్‌ను దక్కించుకున్న ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మాలో ఈ నెల (ఆగస్టు)11 వ తేదీన సాయంత్రం 6. 30 గంటలకు ప్రసారం కానుంది. రొమాన్స్, క్రైమ్, కామెడీ జోనర్‌లో రానున్న ఈ చిత్రం కోసం టెలివిజన్ ప్రియులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Tags:    

Similar News