నిజంగానే సిద్ధుతో ప్రేమాయణం నడిపిస్తున్న అదితి.. కన్ఫర్మ్ చేసేసింది..
‘మహాసముద్రం’ ప్రాజెక్ట్ టైమ్‌లోనే ప్రేమలో పడిన సిద్ధార్థ్, అదితి రావు హైదరీ.. ప్రస్తుతం అదే లవ్ జర్నీ కంటిన్యూ చేస్తున్నారు.
దిశ, సినిమా: ‘మహాసముద్రం’ ప్రాజెక్ట్ టైమ్‌లోనే ప్రేమలో పడిన సిద్ధార్థ్, అదితి రావు హైదరీ.. ప్రస్తుతం అదే లవ్ జర్నీ కంటిన్యూ చేస్తున్నారు. ప్రత్యేక సందర్భాల్లో కలవడం, ఆ టైమ్‌లో మీడియా కంట పడటంతో వీరి బంధం గురించి గుసగుసలు మరీ ఎక్కువ అయిపోయాయి. అయితే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి.. పలు పర్సనల్ విషయాల గురించి షేర్ చేసింది. ఈ క్రమంలోనే సిద్ధుతో ప్రేమ విషయం గురించి కూడా అడగ్గా.. బ్లష్ అవుతూ సక్సెస్ కావాలనే ఉద్దేశంతో ఫింగర్స్ క్రాస్ చేసింది. తమ బంధంపై ఎలాంటి దృష్టి పడకూడదన్నట్లుగా మురిసిపోయింది. కానీ నోరు తెరిచి మాత్రం సమాధానం చెప్పలేదు. మొత్తానికి ఆమె ఎక్స్ప్రెషన్ వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందని కన్ఫర్మ్ చేయగా.. ఒక్కటైపోవాలని కోరుకుంటున్నారు అభిమానులు.
Read More: బిగ్ బ్రేకింగ్ : సినీ నటుడు శరత్ బాబు కన్నుమూత
‘దృశ్యం’ రీమేక్.. తొలిసారి ఇండియన్ సినిమాను రీమేక్ చేస్తున్న కొరియన్ ఇండస్ట్రీ..