కూల్ ఆంటీస్.. పెళ్లి ఇప్పుడే కాదు: Sruthi Hassan Viral

యంగ్ బ్యూటీ శ్రుతి హాసన్ ప్రేమ, పెళ్లి వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.

Update: 2023-02-03 13:30 GMT

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శ్రుతి హాసన్ ప్రేమ, పెళ్లి వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఇద్దరితో డేటింగ్ చేసి విడిపోయిన ఆమె ప్రస్తుతం శంతను హజారికాతో పీకల్లోతు ప్రేమలో ఉంది. అయితే తాజాగా అతన్ని కూడా మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేనట్లు కనిపిస్తోందంటున్నారు నెటిజన్లు. విషయానికొస్తే.. ఈ జోడి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్న క్రమంలో తాజాగా స్పందించిన శృతి నెటిజన్లకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. 'అమ్మలక్కలు ఇంట్లో కూర్చుని ముచ్చట్లు పెట్టినట్టుగానే రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. కూల్ ఆంటీస్.. పెళ్లి ఇప్పుడే కాదు.. ఇంకా అసలు అనుకోనే లేదు' అంటూ తనదైన స్టైల్‌లో ఇన్‌స్టా స్టోరీలో క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు భిన్న కామెంట్లతో నటిని ఆడేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి : 'వెరీ లూజ్'.. హీరోయిన్ ప్రైవేట్ పార్ట్స్‌పై నెటిజన్స్ బోల్డ్ కామెంట్స్!

Full View

Tags:    

Similar News