నా గ్లామర్ సీక్రెట్ ఆ గదిలోనే ఉంది: Shruti Haasan

స్టార్ నటి శృతిహాసన్‌ తన గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పేసింది

Update: 2023-01-22 06:36 GMT

దిశ, సినిమా: స్టార్ నటి శృతిహాసన్‌ తన గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పేసింది. ఇటీవల విడుదలైన 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య'లో కథనాయికగా నటించిన ఆమె తన కాంతివంతమైన చర్మ సౌందర్యంకోసం తీసుకునే జాగ్రత్తల గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ మేరకు తానెప్పుడూ కెమికల్స్‌ ఎక్కువగా ఉండే హానికరమైన మేకప్‌లను ముఖం, చర్మంపైన అప్లై చేయనని, చర్మసౌందర్యానికి కావాల్సిన సప్లిమెంట్లను వైద్యుల సలహాతోనే వాడుతానని చెప్పింది. 'వంటగదే నా బ్యూటీపార్లర్‌. జుట్టుకు శుద్ధమైన కొబ్బరి నూనె రాసుకుంటా. బేకింగ్‌ సోడా కలిపిన తేనె, పెరుగు, పసుపు, అలొవేరా, టొమాటో, స్ట్రాబెర్రీ లాంటివాటిని ముఖానికి అప్లై చేస్తా. తాగడానికి కొబ్బరి నీళ్లు తప్పనిసరి. ఉదయాన్నే అల్పాహారంలో రెండు ఇడ్లీలు, ఒక కోడిగుడ్డు, ఒక పెద్ద కప్పు తాజాపండ్లు ఉండేలా చూసుకుంటా. మధ్యాహ్న భోజనంలో అన్నం లేదా పాస్తా, సలాడ్స్‌ తింటాను. ఈ సమతుల ఆహారమే నాకు ఆరోగ్యంతోపాటు అందం' అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : కొత్త సినిమాకి విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఏంతో తెలుసా ?

Tags:    

Similar News