నేను సేఫ్‌గా ఉన్నా.. నాకు అలాంటివి ఎదురుకాలేదు: Shraddha Srinath

ప్రజెంట్ సోషల్ మీడియాలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

Update: 2024-09-14 14:36 GMT

దిశ, సినిమా: ప్రజెంట్ సోషల్ మీడియాలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆ నివేదిక ద్వారా బహిర్గతం అయ్యాయి. అప్పటి నుంచి పలువురు హీరోయిన్లు ఈ నివేదికపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ నటి శ్రద్ధా శ్రీనాథ్ స్పందించింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ‘నేను మలయాళ ఇండస్ట్రీలో వర్క్ చేశాను. కానీ ఎప్పుడు వేధింపులు ఎదుర్కోలేదు. పార్టీలకు వెళ్లి వచ్చేటప్పుడు నా చుట్టూ ఏం జరుగుతుందో గమనించుకుంటూ ఉండేదాన్ని.

ఎనిమిదేళ్ల వయసు నుంచే అలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకున్నా. అందుకే నాకు ఎప్పుడూ పరిశ్రమలో అలాంటి వేధింపులు ఎదురుకాలేదు. నేను సురక్షితంగా ఉన్నాను. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. సినిమా సెట్‌లో మహిళలకు సరైన పారిశుద్ధ్య సౌకర్యాలు ఉండవు. అలాంటి కనీస అవసరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. హేమ కమిటీ రిపోర్ట్ చూసి షాకయ్యాను. అలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలు వాటిని ఎవరితో చర్చించాలో తెలియక ఆగిపోతున్నారు. పరిశ్రమలో మహిళలపై వేధింపులు ఆగాలంటే కరెక్ట్‌గా వర్క్ చేసే సంస్థలు రావాలి’ అంటూ చెప్పుకొచ్చింది. 

Read More....

ఏ భారతీయ నటికి దక్కని అరుదైన గౌరవం.. కరీనాకు మాత్రమే సొంతం..

Tags:    

Similar News