బంగారు పూతతో వరుణ్, లావణ్యల పెళ్లి కార్డు.. ఖర్చు చూస్తే షాక్ అవ్వాల్సిందే?
గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఇష్యూ ఏదైనా ఉన్నదా అంటే అది లావణ్య త్రిపాఠీ, వరుణ్ తేజ్ పెళ్లి ముచ్చటే. వీరు ప్రేమలో ఉన్నారు, త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్ : గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఇష్యూ ఏదైనా ఉన్నదా అంటే అది లావణ్య త్రిపాఠీ, వరుణ్ తేజ్ పెళ్లి ముచ్చటే. వీరు ప్రేమలో ఉన్నారు, త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి.
ఈక్రమంలోనే వీరిద్దరికీ ఈరోజు నిశ్చితార్థం జరగబోతుందని అందుకు సంబంధించిన ఒక ఇన్విటేషన్ కార్డు కూడా నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనే విషయంపై మెగా ఫ్యామిలీ ఏ మాత్రం స్పందించలేదు. ఇదిలా ఉంటే తాజాగా వీరి పెళ్లి కార్డ్ వైరల్ అవుతోంది. వీరి వెడ్డికార్డు కోసమే ఏకంగా 80 వేల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా వెడ్డింగ్ కార్డుని బంగారు పూతతో కోటింగ్ చేయిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే అంత డబ్బు కేవలం ఒక వెడ్డింగ్ కార్డు కోసమే వీరు ఖర్చు చేస్తున్నారు అంటే ఇక పెళ్లి కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు మెగా అభిమానులు.
Also Read: కాబోయే భర్తపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన లావణ్య త్రిపాఠి..
సిద్ధార్ట్ ‘టక్కర్’ సినిమా ట్విట్టర్ రివ్యూ.. ఈసారైనా హిట్ పడ్డట్లేనా?