‘సలార్’ నటీనటుల రెమ్యునరేషన్లు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
ప్రభాస్ ‘సలార్’ పార్ట్ 1 థియేటర్స్‌లో డిసెంబర్ 22న విడుదలై దుమ్ము రేపుతోంది. మొదటి షో నుంచే హిట్ టాక్‌తో బాక్సాఫీసును షేక్ చేస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రభాస్ ‘సలార్’ పార్ట్ 1 థియేటర్స్‌లో డిసెంబర్ 22న విడుదలై దుమ్ము రేపుతోంది. మొదటి షో నుంచే హిట్ టాక్‌తో బాక్సాఫీసును షేక్ చేస్తోంది. అంతేకాకుండా భారీగా కలెక్షన్లు రాబడుతూ రికార్డ్ సృష్టిస్తోంది. సినిమా మొత్తం ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్లే ప్రశాంత్ నీల్ సలార్‌ను ప్రేక్షకుల ముందుంచారు. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో అలరించారు.
అయితే సలార్‌లో నటించిన నటీనటుల రెమ్యునరేషన్లకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలు విషయంలోకి వెళితే.. సలార్ సినిమాకు ప్రభాస్ రూ. 100 కోట్ల పారితోషికం తీసుకున్నాడట అంతేకాకుండా లాభాల్లో 10 శాతం షేర్ కూడా తీసుకున్నట్లు టాక్. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూ. 50 కోట్లు తీసుకోగా.. శృతి హాసన్ రూ. 8 కోట్లు, పృథ్వీరాజ్, జగపతిబాబు, కలిసి రూ. 8 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.