Naga Chaitanya: నాగ చైతన్య ‘తండేల్’ మూవీ బడ్జెట్ తెలిస్తే షాకవ్వాల్సిందే?

నాగ చైతన్య ‘తండేల్’ మూవీ బడ్జెట్

Update: 2024-07-21 08:11 GMT

దిశ, సినిమా:  హీరో అక్కినేని నాగ చైతన్య ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళ్లాడు కానీ ఇప్పుడు స్లో అయ్యాడు దీనికి గల ప్రధాన కారణం తీసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడమే. ఈ సారి లేట్ అయినా హిట్ కొట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కార్తికేయ 2 తో బిగ్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందు మొండేటితో ‘తండేల్’ అనే మూవీని చేస్తున్నారు.

ఈ మూవీ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ‘తండేల్’ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. బన్నీ వాస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన గ్లింప్స్ , టీజర్ మూవీ పై అంచనాలు భారీగా పెంచేశాయి. నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్ ప్రాజెక్ట్ గా నిలుస్తుందని నిర్మాతలు చెబుతున్నారు . అయితే, దీనికి సంబందించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను బన్నీ వాస్ ‘ఆయ్’ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో రివీల్ చేసారు. తండేల్ రూ.75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోందని తెలిపారు.

అయితే, దీనిపై నెటిజన్స్ రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బడా హీరోలకే వర్కౌట్ అవ్వడం లేదు మరి చైతూ సినిమాకి ఇంత భారీ బడ్జెట్ ఎందుకు అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా అంటున్నారు. నాగ చైతన్యకి సరైన హిట్ లేక చాలా కాలం అవుతుంది మరి ఈ సమయంలో రిస్క్ చేయడం అవసరమా అంటూ కొందరూ ట్రోల్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News