కొడుకుల కెరీర్ విషయంలో చిరంజీవిని చూసి నాగార్జున నేర్చుకోవాలి..?
అక్కినేని అఖిల్ కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదురుకోక తప్పడం లేదు.
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని అఖిల్ కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదురుకోక తప్పడం లేదు. కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్ స్థాయి సినిమా ఒక్కటి కూడా పడటం లేదు. ఈ క్రమంలో నాగార్జునపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. కెరీర్ పరంగా మెగాస్టార్ చిరంజీవితో పోల్చుతూ.. ఆయన్ని చూసి నేర్చుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. విషయానికి వస్తే..
రామ్ చరణ్ మొదటి సినిమా ‘చిరుత’. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రెస్పాంన్స్ వచ్చినప్పటికి.. రెండో సినిమా రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ క్రమంలో చిరంజీవి రామ్ చరణ్ కెరీర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని.. చరణ్ నటించే ప్రతి సినిమా కథ తెలుసుకుని ఆ కథకు కొన్ని మార్పులు సూచించేవారట. ఈ విధంగా కొడుకు పాన్ ఇండియా రేంజ్‌లో పాపులరిటీ దక్కించుకోవడంలో చిరంజీవి పాత్ర ఉందని టాక్.
కానీ, నాగార్జున మాత్రం కొడుకుల కెరీర్ విషయంలో తప్పటడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. నాగచైతన్య కూడా తొలి మూడు సినిమాలు పరాజయం పాలయ్యాయి. అంతే కాకుండా క్లాస్ సినిమాలతో చైతుకి హిట్‌లు దక్కుతున్న పాన్ ఇండియా స్థాయికి ఎదగలేక పోతున్నారు. చిన్న కొడుకు అఖిల్ విషయానికి వస్తే ఆయన సినిమాల్లో ఒక్కటి కూడా ఇండస్ట్రీ హిట్ స్థాయికి చేరుకోలేదు. ఈ తప్పంతా నాగార్జునదేనని సోషల్ మీడియాలో వాదనలు వినిపిస్తున్నాయి. కొడుకుల కెరీర్ పరంగా నాగార్జున.. మెగాస్టార్ చిరంజీవిని చూసి నేర్చుకోవాలంటూ నెటిజన్లు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ఫస్ట్ గ్లింప్స్ అప్పుడే?