నాగ చైతన్యతో ప్రేమలో ఉన్నట్లు కన్ఫర్మ్ చేసిన శోభిత.. ఈ సారి అఫిషియల్‌గా అనౌన్స్‌మెంట్?

బ్యూటిఫుల్ శోభితా ధూళిపాళ్ల ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించింది. యూనిక్ పాత్రలతో అటు నార్త్‌తోపాటు సౌత్‌లోనూ మెరిసింది. ఓటీటీలో బోల్డ్ ప్రాజెక్ట్‌లు

Update: 2024-05-20 04:33 GMT

దిశ, సినిమా : బ్యూటిఫుల్ శోభితా ధూళిపాళ్ల ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించింది. యూనిక్ పాత్రలతో అటు నార్త్‌తోపాటు సౌత్‌లోనూ మెరిసింది. ఓటీటీలో బోల్డ్ ప్రాజెక్ట్‌లు కూడా చేసింది. ఇక తాజాగా హాలీవుడ్ ఆఫర్‌తో నెక్స్ట్ లెవల్‌ హీరోయిన్ అనిపించుకుంటున్న బ్యూటీ.. భాగస్వామిగా మాత్రం తెలుగు కుర్రోడినే కావాలని అనుకుంటుందా అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతుంది. సమంత-నాగ చైతన్య విడిపోయాక.. చైతుతో డేటింగ్ చేస్తుందనే రూమర్స్ వినిపించాయి. ఇద్దరు ఒకే హోటల్‌లో స్పెండ్ చేసినట్లు ప్రూఫ్స్‌తో సహా కనిపెట్టిన నెటిజన్లు అఫిషియల్‌గా అనౌన్స్ చేస్తే అయిపోతుందిగా అని చర్చించుకుంటున్నారు.

కాగా రీసెంట్‌గా CHAI అనే వర్డ్ ఉపయోగిస్తూ లాజికల్ స్టేటస్ పెట్టింది శోభిత. దీంతో అది చాయ్ గురించా లేక చై గురించా అని ప్రశ్నించారు నెటిజన్లు. ఇక తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై దర్శనమిచ్చిన బ్యూటీ.. పింక్ కలర్ అవుట్ ఫిట్‌లో అదరహో అనిపించింది.అయితే ఇందుకు మ్యాచ్ అయ్యేలా ధరించిన ఇయర్ రింగ్స్‌ CH,D లెటర్స్ మాదిరిగా కనిపిస్తుండటంతో.. చైతన్య పేరు వచ్చేట్లు జాగ్రత్త పడిందని ముచ్చటించుకుంటున్నారు నెటిజన్లు. ధూళిపాళ్ల తన ఇంటిపేరు అని, అందుకే D లెటర్ చెవులకు పెట్టుకుందని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. కనీసం నెక్స్ట్ పోస్టులో అయినా అఫిషియల్ అనౌన్స్ చేయొచ్చు కదా అని మరికొందరు అంటున్నారు.

Full View

Tags:    

Similar News