OTTలోకి శివరాత్రి స్పెషల్ మూవీస్..ఇవి చూస్తూ జాగారం చేయండి!
మహాశివరాత్రి, ఈరోజు భక్తులందరూ ఆ శివయ్యను భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారు. అంతే కాకుండా ఉపవాసం ఉంటూ , జాగారం చేస్తారు.ఇక ఈ రోజు జాగారం చేయడం వలన మంచి జరుగుతుందని
దిశ, సినిమా : మహాశివరాత్రి, ఈరోజు భక్తులందరూ ఆ శివయ్యను భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారు. అంతే కాకుండా ఉపవాసం ఉంటూ , జాగారం చేస్తారు.ఇక ఈ రోజు జాగారం చేయడం వలన మంచి జరుగుతుందని అంటారు మన పెద్దవారు.అయితే నేడు ఆ శివయ్యను స్మరిస్తూ.. ఓటీటీలో పరమేశ్వరుడికి సంబంధించిన సినిమాలు చూస్తూ జాగరం చేయండి.శివరాత్రి సందర్భంగా ఓటాటీలోకి భక్తి చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. కాగా, ఏ ప్లాట్ ఫామ్‌లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయో చూడండి.
భక్త కన్నప్ప : అమెజాన్ ప్రైమ్/యూట్యూబ్
మహాభక్త సిరియాళ : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
భక్త శంకర : (డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలుగు)
భక్త మార్కండేయ : యూట్యూబ్ (తెలుగు)/డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (కన్నడ)
శ్రీ మంజునాథ : ఎరోస్ నౌ ఓటీటీ/యూట్యూబ్
ఉమాచండీ గౌరీశంకరుల కథ : ఈటీవీ విన్/యూట్యూబ్
శివకన్య : ఎరోస్ నౌ ఓటీటీ /యూట్యూబ్
మహాశివరాత్రి : జీ5/యూట్యూబ్
శివరాత్రి మహత్యం :జియో సినిమా/యూట్యూబ్
జగద్గురు ఆదిశంకర : యూట్యూబ్
కాళహస్తి మహత్యం : యూట్యూబ్
శివలీలలు : యూట్యూబ్
దక్షయజ్ఞం : యూట్యూబ్
వీటితో పాటు శివభక్తి సినిమా కాకుండా ప్రపంచంలోని 18 శక్తి పీఠాలు గురించి చెప్పే సర్వం శక్తిమయం వెబ్ సిరీస్ జీ5, ఆహా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.