ఎమ్మెల్యే పదవి పొందిన పల్లవి ప్రశాంత్.. కాంగ్రెస్సా?బీఆర్‌ఎస్సా.. జై కొడుతోన్న ఫ్యాన్స్?

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ సీజన్-7 వివాదాల మధ్య మొదలై.. వివాదాలతో ముగిసింది.

Update: 2024-02-15 12:47 GMT

దిశ, సినిమా: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ సీజన్-7 వివాదాల మధ్య మొదలై.. వివాదాలతో ముగిసింది. హౌస్‌లో 14 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టగా.. చివరకు పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా.. అమర్ దీప్ రన్నర్‌గా నిలిచారు. ఇక శివాజీ హౌస్ పెద్దగా అన్ని చూసుకున్న విషయం తెలిసిందే. పల్లవి ప్రశాంత్‌ను ముందు నుంచే ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. చివరకు రైతుబిడ్డ టైటిల్ విన్నర్ అవ్వడంతో ప్రశాంత్ విజయానికి శివాజీనే కారణమని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వినిపించాయి.

ఇదంతా పక్కన పెడితే మరోసారి బిగ్‌బాస్ 7 టీం మొత్తం బిబిఉత్సవ్ షోలో భాగంగా మళ్ళీ కలుసుకున్నారు. ఈ షోలో ప్రశాంత్.. హౌస్ నుంచి బయటకొచ్చాక తన కుటుంబం ఎంత సఫర్ అయ్యిందో మొదటి స్పందించి.. ఎమోషనల్ అయ్యాడు. బయటికొచ్చాక మా నాన్న కళ్లలో ఆనందం చూడాలనుకున్నాను కానీ కన్నళ్లు చూశాను. మా నాన్న కోర్టు బయట నిల్చోని ఉన్న వీడియో చూశాక నేను ఎందుకు బతికున్నానురా అనిపించింది. అంటూ ప్రశాంత్ స్టేజీపైన్నే కన్నీళ్లు పెట్టుకున్నాడు.

అక్కడున్నవారంతా ప్రశాంత్‌ను ఓదార్చారు. తర్వాత ప్రశాంత్‌ను ఉద్దేశిస్తూ శివాజీ పలు సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ప్రశాంత్‌ను ఆప్యాయంగా హగ్ చేసుకుని.. ఏం రా ప్రశాంత్.. నువ్వు పెద్ద ఎమ్మెల్యే అయిపోయావురా.. నిన్ను కలవడమే కష్టం అయిపోతుందిగా ఇంతకీ ఏ పార్టీ.. కాంగ్రెస్ ఆ? బీఆర్ఎస్ ఆ? ఏం కాదు ఏదో ఒక పార్టీలో కలువు. లేందంటే సొంతంగా పార్టీ పెట్టుకో అంటూ శివాజీ ఫన్నీగా సలహా ఇస్తాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. బిగ్‌బాస్ విన్నర్ అయినంత మాత్రన పాలిటిక్స్‌లో రాణించగలగలా? అంటూ సెటైర్స్ వేయగా.. మరికొంతమంది ఎమ్మెల్యే ప్రశాంత్.. భవిష్యత్తులో కచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు. రైతుబిడ్డ పవర్ ఏంటో చూపిస్తాడు. జై ఎమ్మెల్యే ప్రశాంత్ అంటూ ప్రశాంత్‌కు మద్ధతుగా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఫిబ్రవరి 18న సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానెల్ లో ప్రసారం కానుంది.


Similar News