నేను ముద్దుగా ఉన్నానని వాళ్లకు కడుపుమంట: షెహనాజ్

సోషల్ మీడియాలో తన యాక్టింగ్ అండ్ గ్లామర్‌‌పై ఎదుర్కొంటున్న ట్రోలింగ్‌పై మౌనం వీడింది నటి షెహనాజ్ గిల్.

Update: 2023-09-29 08:42 GMT

దిశ, సినిమా: సోషల్ మీడియాలో తన యాక్టింగ్ అండ్ గ్లామర్‌‌పై ఎదుర్కొంటున్న ట్రోలింగ్‌పై మౌనం వీడింది నటి షెహనాజ్ గిల్. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘థాంక్యూ ఫర్ కమింగ్’ అక్టోబరు 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న బ్యూటీ.. తనను ఫేక్ యాక్టర్ అంటూ వస్తున్న విమర్శలను తిప్పికొట్టింది. ‘నాకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ అందులోనే చాలా మంది హేటర్లు, ట్రోలర్స్ కూడా ఉన్నారు. షెహనాజ్ ఏది చేసినా ఆమె అసలు వ్యక్తిత్వం కాదని, అదంతా ఫేక్ అని ప్రజలు అనుకుంటారు. నిజానికి నా రియాలిటీ వాళ్లు ఎప్పుడూ చూడలేదు. నేను చాలా ప్రత్యేకమైన నటిని కాబట్టే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. నేను నిజంగా అందంగా, ముద్దుగా ఉన్నానని కడుపుమంట. అందుకే నన్ను అబాసుపాలు చేయాలని చూస్తుంటారు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక భూమి పెడ్నేకర్, కుషా కపిల, డాలీ సింగ్, షిబానీ బేడీలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి కరణ్ బులానీ దర్శకుడు.

Tags:    

Similar News