మార్కెట్లో పబ్లిక్‌గా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న హీరోయిన్.. ఏ ఒక్కరు కూడా..
‘ఢిల్లీ క్రైమ్’, ‘డార్లింగ్స్’, ‘డాక్టర్ జీ’ వంటి ప్రాజెక్ట్స్‌లో కీ రోల్ ప్లే చేసిన షెఫాలీ షా.. ప్రతీ మహిళ లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి సెక్సువల్ హరాజ్మెంట్ ఎదుర్కొంటుందని చెప్పింది.
దిశ, సినిమా : ‘ఢిల్లీ క్రైమ్’, ‘డార్లింగ్స్’, ‘డాక్టర్ జీ’ వంటి ప్రాజెక్ట్స్‌లో కీ రోల్ ప్లే చేసిన షెఫాలీ షా.. ప్రతీ మహిళ లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి సెక్సువల్ హరాజ్మెంట్ ఎదుర్కొంటుందని చెప్పింది. తన చిన్నతనంలో స్కూల్ నుంచి వస్తుండగా మార్కెట్లో కొందరు లైంగికంగా వేధించారని, కానీ అప్పుడు సపోర్ట్ చేసేందుకు ఏ ఒక్కరు ముందుకు రాలేదని తెలిపింది. అమ్మాయిలకు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇంట్లో ఉన్న అబ్బాయిలను సరిగ్గా పెంచాలని అభిప్రాయపడింది. తన ఇద్దరు కొడుకులను అలాగే పెంచుతున్నానని.. ఎదుటివారి నుంచి మనం ఎలాంటి రెస్పెక్ట్ కోరుకుంటున్నామో, అలాంటి గౌరవం వారికి ఇస్తే ఎలాంటి సమస్యలు ఉండవని పిల్లలకు చెప్తానంది. అందరూ ఇదే పాటిస్తే సొసైటీలో లైంగిక వేధింపులు ఉండవని తెలిపింది.