పని కోసం దర్శకుల ఫోన్ నంబర్లు సేకరించేవాడిని: Sharman Joshi

బాలీవుడ్ నటుడు శర్మన్ జోషి కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న స్ట్రగుల్స్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు..

Update: 2022-11-28 08:11 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు శర్మన్ జోషి కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న స్ట్రగుల్స్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 2001లో చంద్ర డైరెక్షన్‌లో వచ్చిన 'స్టైల్' సినిమాతో ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన ఆయన పరిశ్రమలో పట్టు సాధించేందుకు కొన్ని చిన్న చిన్న చిత్రాలతోపాటు నాటకాలు కూడా వేసినట్లు తెలిపాడు. ఈ గతాన్నంతా ఓ పోరాటంగా పేర్కొన్న జోషి.. మూవీ చాన్స్‌ల కోసం దర్శకుల ఫోన్ నంబర్‌లను సేకరించుకోవడానికి టెలిఫోన్ డైరెక్టరీని ఉపయోగించినట్లు తెలిపాడు. 'తొలి రోజుల్లో ఇండస్ట్రీకి చెందిన వారందరి టెలిఫోన్ నంబర్లతో కూడిన ఫిల్మ్ డైరెక్టరీ ఉండేది. పనికోసం వాళ్లందరికీ నా ల్యాండ్‌లైన్ నుంచి కాల్ చేసేవాడిని. అందరూ నాతో చాలా గౌరవంగా మాట్లాడేవారు. అలా ఎంతోమందితో నాకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. దీంతో తమ ప్రాజెక్టుల్లో నటించేందుకు అప్యాయంగా పిలిచేవారు. మరికొందరు తమ పర్సనల్ మీటింగ్స్‌కు కూడా ఆహ్వానించేవారు' అంటూ గతాన్ని గుర్తుచేసుకున్నాడు. చివరగా అప్పట్లో మొబైల్స్ లేకపోవడం వల్ల ల్యాండ్ లైన్ ఫోన్స్ మనుషుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచేందుకు ఉపయోగపడ్డాయని, ఇప్పుడు అందరిచేతుల్లో ఫోన్లు ఉన్నా ఎవరూ కాల్ చేయట్లేదని తెలిపాడు శర్మన్ జోషి. 

ఇవి కూడా చదవండి : ఇది గమ్మత్తయిన వ్యాపారం.. హిట్ ఫ్లాప్ కామన్: Chunky Panday

Tags:    

Similar News