నడవలేని స్థితిలో ‘వీల్ చైర్‌కు పరిమితమైన షణ్ముఖ్.. తాజాగా స్పందించి..
‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ అండ్ ‘సూర్య’ వెబ్‌సిరీస్‌లో నటించి యూట్యూబ్‌ను షేక్ చేశాడు షణ్ముఖ్.
దిశ, వెబ్‌డెస్క్: ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ అండ్ ‘సూర్య’ వెబ్‌సిరీస్‌లో నటించి యూట్యూబ్‌ను షేక్ చేశాడు షణ్ముఖ్. ప్రస్తుతం స్టార్ హీరోలకున్న క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో లో ఒక కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్ రావడంతో బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టాడు. హౌస్‌లో ఉన్నన్ని డేస్ సిరితో ప్రమాయణం నడిపించాడు. దీంతో నెటిజన్లు తిట్టిపోశారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక తన ప్రేమించిన అమ్మాయి కాస్త బ్రేకప్ చేప్పేసింది. ఇటీవల షణ్ముఖ్ వీల్ చైర్‌లో కూర్చున్న ఫోటోను నెట్టింట షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. దీంతో అతడు తాజాగా స్పందించి.. ‘‘ఈ చైర్ నా కోసం కాదు. మా తాతయ్య కోసం తీసుకొచ్చాం. నేను సరదాగా ఫోటో దిగి పోస్ట్ చేశానని’’ చెప్పడంతో షణ్ముఖ్ అభిమానులు ఊపిరి పిల్చుకున్నారు.
Also Read..
సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన కాజోల్.. చాలా కఠిన పరిస్థితుల్లో ఉందట