అతను నన్ను దారుణంగా మోసం చేశాడంటూ షాలిని పాండే షాకింగ్ కామెంట్స్!

యంగ్ బ్యూటీ షాలిని పాండే అర్జున్ రెడ్డి సినిమాతో అందరినీ మెప్పించింది. లిప్ లాక్, బోల్డ్ సీన్స్ చేసి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

Update: 2024-07-13 04:27 GMT
అతను నన్ను దారుణంగా మోసం చేశాడంటూ షాలిని పాండే షాకింగ్ కామెంట్స్!
  • whatsapp icon

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ షాలిని పాండే అర్జున్ రెడ్డి సినిమాతో అందరినీ మెప్పించింది. లిప్ లాక్, బోల్డ్ సీన్స్ చేసి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. షాలిని ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది నడంలో అతిశయోక్తి లేదు. ఆ తర్వాత ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో గత కొద్ది కాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇటీవల హిందీలో మాహారాజ్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో షాలిని నిత్యం పలు పోస్టులు పెడుతూ నెట్టింట రచ్చ చేస్తుంది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్యూటీ ఓ వ్యక్తి తనను దారుణంగా మోసం చేశాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ అర్జున్ రెడ్డి తర్వాత అన్ని అలాంటి పాత్రలే వచ్చాయి. కానీ రోటీన్‌గా ఉండడం ఇష్టం లేక వదులుకున్నాను. అయితే ఈ మూవీ తర్వాత నన్ను దారుణంగా ట్రోల్ చేశారు. అలాగే నా బాడీని టార్గెట్ చేసి మాట్లాడారు. అయితే నాకు భాష రాకపోవడం వల్ల పెద్దగా ఇబ్బంది కలగలేదు. కానీ ఇండస్ట్రీలోని కొందరి బిహేవియర్ ఇబ్బందిగా అనిపించింది. భాష రాదని చెప్పి నాతో చెప్పకూడని మాటలు, చేతలు చేయించేవారు. ఇండస్ట్రీకి రావడం కొత్త కావడంతో నేను కూడా ఎదురు మాట్లాడలేక పోయాను. అయితే అర్జున్ రెడ్డి సమయంలో నా మేనేజర్ కూడా నన్ను దారుణంగా మోసం చేశాడు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం షాలిని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News