"శాకుంతలం" ట్రైలర్ రిలీజ్.. కన్నీరు పెట్టుకున్న Samantha

సమంత ప్రధాన పాత్రలో, గుణశేఖర్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన చిత్ర 'శాకుంతలం' .ఈ సినిమా, షూటింగ్ ను పూర్తిచేసుకుని చాలా కాలమే అయింది.

Update: 2023-01-09 07:51 GMT
"శాకుంతలం" ట్రైలర్ రిలీజ్.. కన్నీరు పెట్టుకున్న Samantha
  • whatsapp icon

దిశ, సినిమా: సమంత ప్రధాన పాత్రలో, గుణశేఖర్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన చిత్ర 'శాకుంతలం' .ఈ సినిమా, షూటింగ్ ను పూర్తిచేసుకుని చాలా కాలమే అయింది. అప్పటి నుంచి కూడా ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులు జరుపుకుంటూ వెళుతోంది. ఇక త్వరలో అన్ని పనులు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఈ రోజు ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్రాండ్ విజువల్స్ తో కూడిన ట్రైలర్ లో సమంత అద్భుతంగా నటించింది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సమంత అందం, అభినయం సూపర్ గా ఉన్నాయి.

ట్రైలర్ గ్రిప్పింగ్ గా, ఆకట్టుకునే డైలాగ్స్ తో ఉండటం తో సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. అలాగే ఈ పిక్చర్ ద్వారా ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తనయ అర్హ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే .. ఈ ట్రైలర్ లో అర్హ ని చిన్న సీన్ లో చూపించారు. ఇక గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్న, ఈ చిత్రంలో దేవ మోహన్, మోహన్ బాబు, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఫిబ్రవరి 17, 2023 న వరల్డ్ వైడ్ తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే ఈ ట్రైలర్ రీలీజ్ ఈవెంట్‌లో సమంత భావోద్వేగానికి‌లోనయ్యారు.

Tags:    

Similar News