Shahrukh Khan: 'ముఫాసా: ది లయన్ కింగ్' కోసం రంగంలోకి షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ..

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్న 'ముఫాసా: ది లయన్ కింగ్' ఫ్రాంచైజ్‌లోని కొత్త సినిమా డిస్నీ ప్లెస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Update: 2024-08-12 11:47 GMT

దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్న 'ముఫాసా: ది లయన్ కింగ్' ఫ్రాంచైజ్‌లోని కొత్త సినిమా డిస్నీ ప్లెస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం మొట్టమొదటి సారిగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన ఇద్దరు తనయుల‌తో కలిసి వాయిస్ యాక్టింగ్ (డబ్బింగ్) చేయనున్నారు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్ర ‘ముఫాసా’ కి షారుఖ్ డబ్బింగ్ చెప్పనుండగా.. ఆర్యన్ ఖాన్ సింబా పాత్రకి డబ్బింగ్ చెప్తున్నారు. చిన్నప్పటి ముఫాసా పాత్రకి షారుఖ్ చిన్న కుమారుడు అబ్రమ్ ఖాన్ డబ్బింగ్ చెప్తున్నారు. షారుఖ్‌తో పాటు అతని కుమారులు ఇప్పటికే డబ్బింగ్ చెప్పిన హిందీ ట్రైలర్ విడుదల కాగా.. సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచింది. డిసెంబర్ 20 న ఈ సినిమా ఇంగ్లీష్, హిందీతో పాటు, తెలుగు తమిళ్ భాషల్లో కూడా విడుదల కానుంది.

Tags:    

Similar News