Deepika Padukone బర్త్ డే.. స్పెషల్ పిక్ షేర్ చేసిన ShahRukh Khan

బాలీవుడ్ నటి దీపిక పదుకొణె 37వ పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2023-01-05 12:21 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ నటి దీపిక పదుకొణె 37వ పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా విష్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తనదైన స్టైల్‌లో దీపికకు విష్ చేసిన షారుఖ్.. తమ అప్ కమింగ్ మూవీ 'పఠాన్' నుంచి దీపికకు సంబంధించిన ఓ యాక్షన్ స్టంట్ పిక్‌‌ను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ స్వీట్ నోట్ రాసుకొచ్చాడు.

'నా ప్రియమైన దీపికపదుకొనే.. మీకు అవకాశం వచ్చిన ప్రతి అవతార్‌లో సాధ్యమైనంత ప్రతిభ చూపించి స్క్రీన్‌ని సొంతం చేసుకునేలా అభివృద్ధి చెందారు! ఎల్లప్పుడూ ఇలాగే గర్వంగా ఉంటూ మరిన్ని కొత్త శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్ డే.. లాట్స్ ఆఫ్ లవ్' అంటూ సహనటిపై తన ప్రేమను కురిపించాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌పై స్పందిస్తున్న ఫ్యాన్స్.. 'షారుక్ మీరు ప్రతి ఒక్కరినీ ప్రేరేపించే విధానం అద్భుతంగా ఉంటుంది. మరోసారి మీ ఇద్దరూ అదరగొట్టిన 'పఠాన్' చూడటానికి జనవరి 25 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం' అంటూ దీపికకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇది కూడా చదవండి : 'జగమే మాయ'కు ఘన విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: చిత్ర బృందం

Tags:    

Similar News