ఆ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నానన్న షారుఖ్.. ఆందోళనలో ఫ్యాన్స్
నటుడు షారూఖ్‌ఖాన్ తనకు ఆరోగ్యం బాగోలేదని, కొంతకాలంగా ఓ చిన్న ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు తెలిపాడు.
దిశ, సినిమా: నటుడు షారూఖ్‌ఖాన్ తనకు ఆరోగ్యం బాగోలేదని, కొంతకాలంగా ఓ చిన్న ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు తెలిపాడు. రీసెంట్‌గా ఫ్రీవీలింగ్ ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్‌లో ట్విట్టర్ వేదికగా అభిమానులతో ఇంటరాక్ట్ అయిన హీరో.. తనకు ఇష్టమైన సినిమాలు, ఫుడ్, గేమ్స్ గురించి వెల్లడించాడు. ఈ మేరకు అతి ఎక్కువగా ఇష్టపడే వంటకం గురించి చెప్పాలని ఓ ఫాలోవర్ అడగగా 'ప్రస్తుతం చిన్న స్టమక్ ఇన్ఫెక్షన్‌తో అస్వస్థతకు లోనవుతున్నా. కాబట్టి ఇటీవల కొంతకాలంగా కొద్ది మొత్తంలో పప్పు అన్నం మాత్రమే తీసుకుంటున్నా' అని తెలిపాడు.
ఫీఫా ప్రపంచ కప్‌లో ఇష్టమైన జట్టు పేరు అడగగా తన దగ్గర అనేక దేశాల ఫుట్‌బాల్ జట్ల జెర్సీలు ఉన్నాయంటూ ఆన్సర్ చేయకుండానే జారుకున్నాడు. ఇక ఇష్టమైన సినిమా సల్మాన్ నటించిన 'బజరంగీ భాయిజాన్' అని చెప్పిన షారుఖ్.. 'మనమందరం చాలా కష్టపడి పని చేస్తున్నాం. ఆ ప్రయత్నంలోనే నేను మిమ్మల్ని మరింత అలరిస్తానని ఆశిస్తున్నా. అయితే నేను ఎన్నడూ నా సినిమాలపై వ్యాపార అంచనాలు వేయలేదు. మిమ్మల్ని అలరిస్తూ నవ్వించడమే నా వ్యాపారంగా భావిస్తున్నా' అంటూ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్స్ వైరల్ అవుతుండగా ఇన్ఫెక్షన్ నుంచి వీలైనంత త్వరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
READ MORE
పార్టీ కోసం భార్య పిల్లలను లెక్కచేయలేదు: పవన్‌పై Nagababu ప్రశంసలు